

పిల్లల్లో అధిక మొబైల్ వాడకం క్రమంగా వ్యసనంగా మారి శారీరక, మానసిక ఆరోగ్యం, చదువులు, దినచర్యపై తీవ్ర ప్రభావం చూపుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువసేపు స్క్రీన్ చూసే అలవాటు వల్ల ‘టెక్స్ట్ నెక్’, కళ్ల అలసట, నిద్రలేమి వంటి సమస్యలు పెరుగుతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు.
రాత్రి వేళల్లో మొబైల్ వాడకం మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గించి నిద్రలేమి, చిరాకు, అలసటకు కారణమవుతోందని పేర్కొన్నారు. అలాగే శారీరక చురుకుదనం తగ్గి ఊబకాయం, మధుమేహం వంటి జీవనశైలి వ్యాధుల ప్రమాదం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.
ఈ సమస్య నుంచి పిల్లలను దూరం చేయాలంటే తల్లిదండ్రులు ముందుగా వారితో మాట్లాడాలని డాక్టర్లు సూచిస్తున్నారు. మొబైల్ వాడకానికి సమయ పరిమితులు పెట్టడం, ఆటలు, చదువు, కుటుంబంతో గడిపే సమయాన్ని పెంచడం చాలా అవసరమని తెలిపారు. తల్లిదండ్రులు కూడా మంచి ఉదాహరణగా నిలవాలని, క్రమంగా మొబైల్ వినియోగాన్ని తగ్గించేలా పిల్లలను ప్రోత్సహించాలని వైద్యులు సూచించారు.
గమనిక: మేము అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనికి మేము ఎటువంటి బాధ్యత వహించము. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని, న్యూట్రిషనిస్ట్ను సంప్రదించి వారి సలహా మేరకు అనుసరించండి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!