

ప్రతి రోజు బిగ్గరగా నవ్వడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నేటి ఒత్తిడితో నిండిన జీవనశైలిలో నవ్వు ఒక సహజ ఔషధంలా పనిచేస్తుంది. ఇది కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్లను తగ్గించి, శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతుందని వారు చెబుతున్నారు. క్రమం తప్పకుండా బిగ్గరగా నవ్వడం వల్ల మానసిక స్థితి తక్షణమే మెరుగుపడటంతో పాటు శారీరక ఆరోగ్యం కూడా బలోపేతం అవుతుంది.
నిపుణుల ప్రకారం, బిగ్గరగా నవ్వడం ఒక సరళమైన వ్యాయామంలా పనిచేసి ఆయుష్షును పెంచడంలో సహాయపడుతుంది. నవ్వే వ్యక్తులు సాధారణంగా మంచి ఆరోగ్యం కలిగి ఉండి ఎక్కువ కాలం జీవిస్తారని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఆనందం, సానుకూల ఆలోచనలు దీర్ఘాయువుతో ముడిపడి ఉన్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. అలాగే నవ్వడం వల్ల గుండె స్పందన మెరుగుపడి, రక్తపోటు తగ్గి, రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుందని చెబుతున్నారు.
బిగ్గరగా నవ్వడం వల్ల డయాఫ్రాగమ్, ఊపిరితిత్తులు చురుకుగా మారి శరీరంలో ఆక్సిజన్ స్థాయులు పెరుగుతాయి. దీంతో శ్వాస తీసుకోవడం సులభమవుతుంది. అదేవిధంగా, డోపమైన్ మరియు సెరోటోనిన్ వంటి ఆనంద హార్మోన్లు ఎక్కువగా విడుదలై ఒత్తిడి, ఆందోళన తగ్గి మనస్సు ప్రశాంతంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక : మేము అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనికి మేము ఎటువంటి బాధ్యత వహించము. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని, న్యూట్రిషనిస్ట్ను సంప్రదించి వారి సలహా మేరకు అనుసరించండి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!