

రోజూ పళ్ళు తోముకోవడం అనే సాధారణ అలవాటునే ఫిట్‌నెస్‌కు ఉపయోగించుకోవచ్చని అమెరికన్ అధ్యయనాలు సూచిస్తున్నాయి. బ్రష్ చేసేటప్పుడు ఒక కాలిపై నిలబడే సింగిల్ లెగ్ బ్యాలెన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల శరీర స్థిరత్వం, సమన్వయం పెరుగుతుంది. హ్యాబిట్ స్టాకింగ్ అనే ఈ పద్ధతి ద్వారా ప్రత్యేకంగా సమయం కేటాయించకుండా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఒక్కో కాలిపై 30 సెకన్లు నిలబడటం వల్ల మెదడు, కండరాల మధ్య అనుసంధానం బలపడుతుంది, పడిపోవడం వంటి ప్రమాదాలు తగ్గుతాయి.
అదనంగా, ఈ అలవాటు వల్ల కోర్ కండరాలు, పొట్ట, నడుము, తుంటి భాగాలు బలపడతాయి. చీలమండలు, పాదాల్లో బలం పెరిగి ఇన్జూరీలను నివారించడంలో సహాయపడుతుంది. బ్యాలెన్స్‌ను కాపాడటానికి అవసరమైన ఏకాగ్రత వల్ల మానసిక ఒత్తిడి తగ్గి రోజంతా ఉల్లాసంగా ఉండవచ్చు. ప్రారంభంలో సపోర్ట్‌తో ప్రారంభించి, తర్వాత సహాయం లేకుండా చేస్తే పూర్తి ప్రయోజనాలు పొందవచ్చు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!