

భారతదేశంలో ముఖ్యంగా మహిళల్లో రక్తహీనత సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గిపోతే అలసట, తల తిరగడం, నీరసం వంటి సమస్యలు ఎదురవుతాయి. హిమోగ్లోబిన్ అనేది ఎర్ర రక్త కణాల్లో ఉండే ముఖ్యమైన ప్రోటీన్. ఇది శరీరానికి అవసరమైన ఆక్సిజన్‌ను సరఫరా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఐరన్ లోపం కారణంగా రక్తహీనత సమస్య పెరుగుతుండటంతో.. సహజంగా హిమోగ్లోబిన్ పెంచేందుకు ఆహారంలో ఐరన్ అధికంగా ఉండే పదార్థాలను చేర్చాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఆకుకూరలు, పప్పుధాన్యాలు, గుమ్మడి గింజలు, ఖర్జూరం, ఎండుద్రాక్ష వంటి శాఖాహార ఆహారాల్లో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. అలాగే గుడ్లు, చేపలు, చికెన్, ఎర్ర మాంసం వంటి మాంసాహార పదార్థాలు కూడా హిమోగ్లోబిన్ పెంచడంలో సహాయపడతాయి. ఐరన్ శరీరానికి బాగా అందాలంటే నిమ్మకాయ, నారింజ, ఉసిరికాయ వంటి విటమిన్-C ఉన్న ఆహారాలను కూడా తీసుకోవాలి. అయితే ఐరన్ ఫుడ్స్ తీసుకున్న వెంటనే టీ, కాఫీ, పాలు వంటి పదార్థాలను తీసుకోకపోవడం మంచిదని సూచిస్తున్నారు.
గమనిక: రక్తహీనత తీవ్రంగా ఉన్నవారు స్వయంగా మందులు వాడకుండా ముందుగా రక్తపరీక్షలు చేయించుకుని వైద్యుల సలహా తీసుకోవాలి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!