

మటన్ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, అందులోని అన్ని ముక్కలు సమానంగా ఆరోగ్యకరంగా ఉండవు. చాప్స్, భుజం, సీనా, ఛాతి భాగాల్లో ఫ్యాట్, క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే ఆ భాగాల్లో కదలిక తక్కువగా ఉంటుంది. ఈ ముక్కలు బిర్యానీ, కర్రీల్లో రుచిగా, జ్యూసీగా ఉంటాయి. అయితే ఇవి తరచూ తింటే రోజువారీ క్యాలరీల పరిమితిని దాటించి ఆరోగ్యానికి హానికరం అవుతాయి.
మటన్‌లోని సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ రక్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ (ఎల్‌డిఎల్) స్థాయిలను పెంచి గుండె జబ్బులు, ఒబేసిటీ, ఫ్యాటీ లివర్ సమస్యలకు దారితీస్తాయి. రోజుకు 100–150 గ్రాములకే పరిమితం చేయడం, వారంలో రెండు సార్లకు మించకుండా తినడం మంచిది. వెనుక కాళ్ల భాగం ముక్కలను ఎంచుకోవడం, కనిపించే ఫ్యాట్ తొలగించడం, డీప్ ఫ్రై చేయకుండా తక్కువ ఆయిల్‌తో వండుకోవడం ఆరోగ్యకరం.
గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏవైనా ఆరోగ్య సమస్యలు లేదా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించి వారి సూచనలు పాటించండి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!