

ఉదయం అల్పాహారంగా ఒక కప్పు ఓట్స్ తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఓట్స్‌లో పీచు పదార్థం, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులోని బీటా-గ్లూకాన్ ఫైబర్ ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దీంతో ఆకలి నియంత్రణలో ఉండటంతో పాటు అనవసరమైన స్నాక్స్ తీసుకోవడం తగ్గి, బరువు నియంత్రణకు సహాయపడుతుంది. అలాగే ఓట్స్‌లోని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు శరీరానికి నెమ్మదిగా శక్తిని అందించి రోజంతా చురుకుగా ఉండేందుకు తోడ్పడతాయి.
ఓట్స్‌లోని బీటా-గ్లూకాన్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడటంతో గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరచి మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా నియంత్రించడంలో సహాయపడుతుంది. ఓట్స్‌లో ఉండే అవేనాంత్రమైడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్, మంటను తగ్గించడంలో తోడ్పడతాయి. ఓట్స్‌ను పాలు లేదా పెరుగు, పండ్లు, నట్స్‌తో కలిపి తీసుకుంటే మరింత పోషకమైన అల్పాహారంగా మార్చుకోవచ్చు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!