

ఫ్రిడ్జ్‌లు అందుబాటులోకి రాకముందు చల్లని నీరు, ఆహారాన్ని నిల్వ చేయడం ఒక సవాలుగా ఉండేది. అయితే మన తాతలు, నానమ్మలు సహజమైన పద్ధతులతోనే ఈ సమస్యను పరిష్కరించేవారు. అలాంటి పద్ధతుల్లో ఒకటి “సొరకాయ బుర్ర,” ఇది పేదల ఫ్రిడ్జ్‌గా ప్రసిద్ధి చెందింది. ఇప్పటికీ అనేక గ్రామాల్లో దీన్ని ఉపయోగిస్తున్నారు. దీన్ని తయారు చేయడం చాలా సులభం—లావుగా గుండ్రంగా ఉన్న సొరకాయను తీసుకుని పూర్తిగా ఎండబెట్టి, లోపలి గుజ్జును తీసేస్తే ఒక ఖాళీ బుర్రలా మారుతుంది. అదే సొరకాయ బుర్రగా ఉపయోగపడుతుంది.
ఈ బుర్రలో నీరు చల్లగా ఉండటానికి కారణం దాని సహజ శీతలీకరణ లక్షణాలు. మట్టికుండల మాదిరిగానే ఇది కూడా నీటిని సహజంగా చల్లబరుస్తుంది. పూర్వకాలంలో రైతులు, కూలీలు పొలాలకు వెళ్లేటప్పుడు ఇందులోనే నీళ్లు తీసుకెళ్లేవారు. ఎండలో గంటల తరబడి ఉన్నా కూడా నీరు చల్లగానే ఉండేది. కొందరు మజ్జిగ, గంజి వంటి పదార్థాలను కూడా ఇందులోనే నిల్వ చేసేవారు. ఖర్చు లేకుండా అందుబాటులో ఉండే ఈ పద్ధతి ఆరోగ్యానికి కూడా మంచిదిగా భావిస్తారు. ఇందులో నిల్వ చేసిన నీరు శరీర వేడిని తగ్గించి, గొంతు సమస్యలు, జలుబు వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు.
గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏవైనా ఆరోగ్య సమస్యలు లేదా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించి వారి సూచనలు పాటించండి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!