

చలిలో వణుకడం సహజమే కానీ భయం వేసినప్పుడు కూడా చేతులు, కాళ్లు వణకడం అనుభవించే వారు చాలా మంది ఉన్నారు. ఆకస్మికంగా భయంకరమైన సంఘటనలు ఎదురైనప్పుడు లేదా చీకట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. నిపుణుల ప్రకారం భయం కేవలం భావోద్వేగం మాత్రమే కాదు, అది శరీరంలో తక్షణ మార్పులను కలిగించే ప్రతిస్పందన. ప్రమాద సంకేతాలను గుర్తించినప్పుడు మెదడులోని అమిగ్డాలా భాగం చురుకుగా మారి శరీరాన్ని అప్రమత్తం చేస్తుంది.
ఈ సమయంలో అడ్రినలిన్ హార్మోన్ విడుదలై గుండె వేగం పెరగడం, శ్వాస వేగంగా మారడం, కండరాలు బిగుసుకోవడం జరుగుతుంది. ఈ కండరాల ఒత్తిడే వణుకు కారణం. తీవ్ర భయంలో చెమటలు పట్టడం, తల తిరగడం, ఆందోళన పెరగడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. నిపుణులు ప్రశాంతంగా ఉండటం, లోతైన శ్వాసలు తీసుకోవడం, సానుకూల ఆలోచనలు చేయడం ద్వారా భయాన్ని నియంత్రించాలని సూచిస్తున్నారు. తరచూ తీవ్ర భయం ఉంటే వైద్యులను సంప్రదించడం మంచిది.
గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏవైనా ఆరోగ్య సమస్యలు లేదా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించి వారి సూచనలు పాటించండి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!