
జనరల్

చలికాలంలో కీళ్ల నొప్పులు, జలుబు, శ్వాస సంబంధిత సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ సమయంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అందులో ఉలవలు ముఖ్యమైనవి.
ఉలవల్లో ప్రోటీన్, కాల్షియం, ఐరన్, పీచు, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతను నిలబెట్టి శక్తిని అందిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరచి మలబద్ధకం, గ్యాస్ సమస్యలను తగ్గిస్తాయి.
ఉలవలు తీసుకోవడం వల్ల జలుబు, ఆస్తమా, గొంతు సమస్యలకు ఉపశమనం లభిస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చారు, రసం, కూర లేదా మొలకల రూపంలో డైట్లో చేర్చుకోవచ్చు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!