

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో పాటు పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం కూడా త్వరగా ముగియాలని భారత్ కోరుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత్ ఎల్లప్పుడూ శాంతి స్థాపనకే మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. పోలండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్‌తో కలిసి గురువారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో మోదీ మాట్లాడారు. భారత్, పోలండ్ దేశాలకు ప్రజాస్వామ్య విలువలపై బలమైన విశ్వాసం ఉందని పేర్కొన్నారు. ఆ విలువలను మరింత బలోపేతం చేసేందుకు అంతర్జాతీయ వ్యవస్థల్లో సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు.
భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని మోదీ ప్రశంసించారు. ఈ ఒప్పందం భారత్, పోలండ్ మధ్య ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని తెలిపారు. అంతేకాకుండా, రక్షణ, అంతరిక్షం, అణు ఇంధన రంగాల్లో పరస్పర సహకారాన్ని విస్తరించేందుకు భారత్, పోలండ్ ఒప్పందాలు చేసుకున్నాయని వెల్లడించారు. ఈ భాగస్వామ్యం రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు వివిధ కీలక రంగాల్లో కొత్త అవకాశాలకు మార్గం సుగమం చేస్తుందని పేర్కొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!