

వన్యప్రాణుల సంరక్షణ, వేట నిరోధక చర్యల్లో విశేష సేవలందించి విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన అటవీ బీట్ ఆఫీసర్ బానోతు నవీన్‌కు కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో గుర్తింపు కల్పించింది. వన్యప్రాణుల రక్షణలో విశేష కృషి చేసిన అటవీ సిబ్బందికి అందించే అవార్డుకు ఆయనను ఎంపిక చేసింది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ చేపట్టిన ఎంపిక ప్రక్రియలో భాగంగా ‘ఫ్రంట్‌లైన్ స్టాఫ్ – ప్రొటెక్షన్ అండ్ యాంటీ-పోచింగ్’ విభాగంలో నవీన్‌కు ఈ గౌరవం దక్కింది.
నవీన్ తెలంగాణ అటవీ శాఖలోని చెరువుసింగారం వెస్ట్ బీట్, ముసలిమడుగు సెక్షన్, పాల్వంచ రేంజ్లో బీట్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించారు. వన్యప్రాణుల వేటను అరికట్టడంతో పాటు వాటి సంరక్షణ కోసం క్షేత్రస్థాయిలో ఆయన చేసిన సేవలకు ఈ అవార్డు గుర్తింపుగా నిలవనుంది. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన నవీన్‌కు మరణానంతరం ఈ అవార్డు ప్రకటించడం ఆయన కుటుంబానికి, తెలంగాణ అటవీ శాఖకు గౌరవప్రదమైన విషయమని అటవీ దళాల అధిపతి వినయ్ కుమార్ తెలిపారు. అటవీ, వన్యప్రాణుల సంరక్షణ కోసం అంకితభావంతో పనిచేసే సిబ్బందికి నవీన్ సేవలు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!