

రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో మరో భారీ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కనున్న నేపథ్యంలో సంగీత దర్శకుడి ఎంపికపై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. దాదాపు రెండు దశాబ్దాలుగా సుకుమార్ ప్రతి చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తూ వస్తున్నారు. ‘ఆర్య’ నుంచి ‘పుష్ప-2’ వరకు ఈ జోడీ కలిసి అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాలకు పనిచేసి టాలీవుడ్లో విజయవంతమైన దర్శకుడు-సంగీత దర్శకుల కాంబినేషన్‌గా గుర్తింపు పొందింది.
అయితే ‘పుష్ప-2’ తర్వాత పరిస్థితులు మారాయనే ప్రచారం జరుగుతోంది. దేవిశ్రీ ప్రసాద్ ప్రస్తుతం నటుడిగానూ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడంతో పాటు పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్-సుకుమార్ ప్రాజెక్ట్‌కు కొత్త సంగీత దర్శకుడిని ఎంపిక చేసే అవకాశాలపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!