

ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సినిమాపై మరో రూమర్ తెరపైకి వచ్చింది. ఈ మూవీలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ నటించనున్నారని, ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాల్లో ఆమె ఎన్టీఆర్‌కు తల్లి పాత్రలో కనిపిస్తుందని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో అధికారికంగా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి లీకుల రూపంలో అనేక రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ హైలైట్‌గా ఉంటాయని సమాచారం. ఎన్టీఆర్ కెరీర్లోనే ఇది బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలవాలనే లక్ష్యంతో ప్రశాంత్ నీల్ చాలా సమయం తీసుకుని స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారని తెలుస్తోంది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాల్లో ఇది అత్యుత్తమంగా ఉండబోతుందని అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!