

న్యాచురల్ స్టార్ నాని వరుస విజయాలతో దూసుకుపోతుండటంతో ఆయన ప్రతి కొత్త ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. దర్శకుడు సుజీత్‌తో చేయనున్న ‘బ్లడీ రోమియో’ చిత్రం అధికారికంగా ప్రారంభం కాకముందే సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ స్టైలిష్ యాక్షన్ డ్రామా లండన్ నేపథ్యంతో రూపొందనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ పూర్తయిన తర్వాత ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకురావాలని చిత్రబృందం భావిస్తోంది. ముంబైలో ఇటీవల నిర్వహించిన యాక్షన్ పరీక్షా చిత్రీకరణకు మంచి స్పందన లభించినట్లు తెలుస్తోంది. దసరా తర్వాత రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశముంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. 2027 వేసవిలో చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!