

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం పూర్తయిన తర్వాత తన చిరకాల స్వప్నమైన ‘మహాభారతం’ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు జక్కన్న సిద్ధమవుతున్నారనే ప్రచారం మొదలైంది. బాహుబలి సమయంలోనే ఈ సినిమాపై చర్చ జరిగినప్పటికీ, ఇతర చిత్రాల కమిట్‌మెంట్ల కారణంగా రాజమౌళి ముందుకు వెళ్లలేకపోయారు. ఇప్పుడు అవన్నీ పూర్తవడంతో డ్రీమ్ ప్రాజెక్టుపై దృష్టి పెట్టనున్నారని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
మరోవైపు ‘రామాయణ’తో భారీ విజయాన్ని అందుకున్న నిర్మాత నమిత్ మల్హోత్రా, ‘మహాభారతం’ నిర్మాణంలోనూ భాగస్వామి కావాలని ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. హాలీవుడ్ స్థాయి దృశ్యాలు, అత్యాధునిక సాంకేతికతతో ఈ ఇతిహాసాన్ని రూపొందించనున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే వీటిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ‘వారణాసి’ తర్వాత నిజంగానే మహాభారతం మొదలైతే భారతీయ సినిమా స్థాయి ప్రపంచవ్యాప్తంగా మరింత పెరగడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!