

‘బలగం’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు వేణు, ఇప్పుడు ‘ఎల్లమ్మ’ అనే ఊర మాస్ కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రంలో సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడింది. అయితే, హీరోయిన్గా ఎవరు నటించనున్నారన్న విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.
ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ను తీసుకోవాలని నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. కీర్తి సురేష్, సాయి పల్లవి, మృణాల్ ఠాకూర్, భాగ్యశ్రీ వంటి ప్రముఖ నటీమణుల పేర్లు పరిశీలనలో ఉన్నాయని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటివరకు ఎవరినీ ఖరారు చేయలేదని తెలుస్తోంది. దర్శకుడు వేణుతో పాటు నిర్మాత దిల్ రాజు కూడా హీరోయిన్ ఎంపికపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. హీరోయిన్ ఎంపిక పూర్తయ్యాక చిత్రీకరణను వేగంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారట.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!