

వారణాసి టైటిల్ అనౌన్స్మెంట్ ఈవెంట్ టాలీవుడ్ లో ఓ పెద్ద చర్చగా మారింది. రాజమౌళి–మహేష్ కాంబినేషన్ సినిమా కాబట్టి గ్రాండ్ ప్లానింగ్స్ సహజం, కానీ ఈసారి మొత్తం ఈవెంట్ నిర్వహణను కార్తికేయ స్వయంగా చూసుకోవడం స్పెషల్ పాయింట్. రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాటు చేసిన ఈ భారీ ఈవెంట్లో 13 వేల చదరపు అడుగుల LED స్క్రీన్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ స్క్రీన్‌కే దాదాపు 30 లక్షలు ఖర్చయినట్టు సమాచారం. దీనికి అవసరమైన భారీ స్కఫోల్డింగ్ను KL నారాయణ దగ్గరినుంచే సమకూర్చుకోవడంతో కొంత ఖర్చు తగ్గింది.
వేదిక, కుర్చీలు, VIP వసతి, హాలీవుడ్ మీడియా కోసం విమాన ప్రయాణాలు, హోటల్ స్టేలు--ఇవన్నీ కలిపి ఈ ఈవెంట్ ఖర్చు 10 కోట్ల నుంచి 15 కోట్ల మధ్య ఉన్నట్లు తాజా టాక్. స్పాన్సర్ల ద్వారా వచ్చిన మొత్తం కేవలం 5 కోట్లు మాత్రమే--ట్విలైట్ రియల్ ఎస్టేట్ 2.5 కోట్లు, మిగిలిన యాడ్స్ 2.5 కోట్లు. మిగిలిన మొత్తాన్ని పూర్తిగా నిర్మాతే భరించాల్సి వచ్చింది. అయితే ఈ ఈవెంట్లో మాత్రం పెద్దగా హంగామా లేకుండా సాఫ్ట్‌గా--స్పీచులు, గ్లింప్స్, శృతి హాసన్ డ్యాన్స్‌తోనే ప్రోగ్రామ్ ముగిసింది. జనం తొక్కిసలాటలు లేకుండానే ప్రశాంతంగా అనుభవించగలిగేలా ప్లానింగ్ చేసిన తీరు ప్రత్యేకంగా నిలిచింది.
ఇన్ని కోట్లు పెట్టిన టైటిల్ ఈవెంట్ చూసాక అసలు ప్రశ్న మాత్రం ఇదే--వారణాసి సినిమా స్కేలు ఎంత భారీగా ఉంటుందో?










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!