

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న గుర్తింపు ప్రత్యేకమైనది. రాజకీయాలతో పాటు సినిమాలను కూడా సమానంగా కొనసాగిస్తూ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఓజీ సినిమాతో సూపర్ సక్సెస్ సాధించిన పవన్, ఇకపై చేసే సినిమాల విషయంలో మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. వరుస విజయాలు సాధించాలనే లక్ష్యంతో కథల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాడు.
ఈ ఏడాది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇదిలా ఉండగా, లోకేష్ కనకరాజ్ గతంలో పవన్ కళ్యాణ్‌కు ఒక కథ చెప్పినా, అది ఆయనకు పెద్దగా నచ్చకపోవడంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న పవన్, ఆ తర్వాత నెల్సన్ దర్శకత్వంలో గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో మరో సినిమా చేయబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ద్వారా తనకంటూ మరో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవాలని పవన్ భావిస్తున్నట్టు సమాచారం.
ఇక ఇదే సమయంలో ఆ డైరెక్టర్ జూనియర్ ఎన్టీఆర్‌కు కూడా ఒక కథ వినిపించాడట. పవన్ కళ్యాణ్‌తో సినిమా ఫిక్స్ అవుతుందా? లేక జూనియర్ ఎన్టీఆర్‌తో ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అవుతుందా? అనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్లో ఆసక్తికర చర్చగా మారింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!