

సుజీత్ తదుపరి ప్రాజెక్టులపై ఫిల్మ్ నగర్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. నాని హీరోగా తెరకెక్కాల్సిన ‘బ్లడీ రోమియో’ సినిమా ఆలస్యమవుతున్న నేపథ్యంలో సుజీత్ ప్రస్తుతం ఓజీ 2 స్క్రిప్ట్ పనులపై పూర్తిగా దృష్టి పెట్టినట్టు సమాచారం. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం నాని ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా ది పారడైజ్ షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తికాకపోవడంతో ‘బ్లడీ రోమియో’ ప్రాజెక్ట్ వాయిదా పడినట్లు తెలుస్తోంది.
ఈ ఖాళీ సమయంలో సుజీత్ ‘ఓజీ 2’ కథను మరింత బలంగా తీర్చిదిద్దుతున్నారని టాక్ వినిపిస్తోంది. మొదటి భాగాన్ని మించి సీక్వెల్లో భారీ యాక్షన్ ఎపిసోడ్లు, భావోద్వేగాలకు ప్రాధాన్యం ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులను దృష్టిలో పెట్టుకుని కథను భారీ స్థాయిలో సిద్ధం చేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ ఫైనల్ స్టేజ్లో ఉందని తెలుస్తోంది. మరోవైపు నాని-సుజీత్ కాంబోలో రానున్న ‘బ్లడీ రోమియో’పై కూడా భారీ ఆసక్తి నెలకొంది. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివర్లో లేదా 2027లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!