

రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కలయికలో తెరకెక్కనున్న సినిమా సెట్స్పైకి వెళ్లేందుకు ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉన్నప్పటికీ, ప్రీ-ప్రొడక్షన్ పనులు తుదిదశకు చేరుకున్నట్లు సమాచారం. ‘రంగస్థలం’ తర్వాత వీరిద్దరి కలయికలో రానున్న ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు చాలా కాలంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కథానాయికతో పాటు సాంకేతిక బృందం ఎంపికపై చిత్రబృందం తుది నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచందర్ను ఎంపిక చేసే అవకాశముందని సమాచారం. ‘ధురంధర్’ చిత్రానికి సంగీతం అందించిన శశ్వత్ సచ్దేవ్ పేరు కూడా వినిపిస్తున్నప్పటికీ, అనిరుధ్ వైపే చిత్రబృందం మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘ధురంధర్’లో నటించిన సారా అర్జున్ పేరు కూడా కథానాయిక పాత్ర కోసం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, వీటిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్వరలోనే ప్రధాన నటీనటులు, సాంకేతిక బృందం వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!