

బిగ్ బాస్ తెలుగు సీజన్ మరింత ఉత్కంఠభరితంగా మారింది. నామినేషన్లు, టాస్కులు, కంటెస్టెంట్ల మధ్య వివాదాలతో హౌస్‌లో సందడి కొనసాగుతుండగా, ఈ వారం దీపావళి పండుగ సందర్భంగా ఎలిమినేషన్ ఉండకపోవచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున ‘నో ఎలిమినేషన్’ ట్విస్ట్ ఇవ్వనున్నట్లు సమాచారం. గతంలో పండుగ సందర్భాల్లో ఎలిమినేషన్ రద్దు చేసినట్లుగానే ఈసారి కూడా మేకర్స్ అదే విధానాన్ని అనుసరించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఈ వారం నామినేషన్లలో పది మంది కంటెస్టెంట్లు ఉన్నట్లు సమాచారం. ముకేష్ గౌడ, వంశీ, అమన్ ఓటింగ్‌లో ముందంజలో ఉండగా, వర్షిణి, నీతూ మాస్టర్, శివకుమార్, సుధీర్ డేంజర్ జోన్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా వర్షిణి, నీతూలలో ఒకరు ఎలిమినేట్ అవుతారని భావిస్తున్న తరుణంలో నో ఎలిమినేషన్ వార్త వారికి ఊరటనిచ్చే అంశంగా మారింది. మరోవైపు, ప్రస్తుతం హౌస్‌లో 13 మంది సభ్యులు ఉండగా, ఫినాలేకు ఐదుగురు మాత్రమే చేరుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాబోయే వారాల్లో డబుల్ ఎలిమినేషన్లు ఉండవచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వారం ఎలిమినేషన్ రద్దు, తదుపరి వారాల ఎలిమినేషన్లపై స్పష్టత రావాలంటే అధికారిక ఎపిసోడ్ ప్రసారం కావాల్సిందే.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!