

ప్రభాస్ నటిస్తున్న ఫౌజీపై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. తాజాగా బయటకు వచ్చిన ఫొటోలు, వీడియోలు సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. ముఖ్యంగా సినిమాలో ఉండబోయే రెండు భారీ యాక్షన్ సన్నివేశాలపై ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. ఈ రెండు యాక్షన్ బ్లాక్స్ ప్రేక్షకులకు అదిరిపోయే థియేట్రికల్ అనుభూతిని అందించనున్నాయనే టాక్ వినిపిస్తోంది. సినిమా కథలోనూ వీటికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది.
ఫౌజీలో భారీ అండర్‌వాటర్ యాక్షన్ సీక్వెన్స్‌ను దాదాపు 20 రోజుల పాటు చిత్రీకరించినట్లు సమాచారం. మరో కీలకమైన యాక్షన్ బ్లాక్‌ను లార్డ్ నరసింహ స్వామి థీమ్‌తో రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రభాస్ హై వోల్టేజ్ యాక్షన్‌తో పాటు భావోద్వేగాలను కూడా అద్భుతంగా పలికించనున్నారని టాక్. ఈ సన్నివేశాల కోసం ముగ్గురు ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్లు పనిచేసినట్లు సమాచారం. సెకండ్ హాఫ్‌లో ఈ రెండు యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన బలంగా నిలవనున్నాయని తెలుస్తోంది. ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా 2026 డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!