
జనరల్

75 దేశాల పౌరులకు ఇమిగ్రెంట్ వీసాల ప్రాసెసింగ్‌ను నిలిపివేసిన ట్రంప్ ప్రభుత్వ నిర్ణయానికి అమెరికా కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. న్యూయార్క్‌లోని ఫెడరల్ న్యాయమూర్తి జెన్నెట్ వర్గాస్ ఈ విధానాన్ని కొట్టివేశారు. జనవరిలో అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించిన ఈ విధానం ద్వారా 75 దేశాల పౌరుల ఇమిగ్రెంట్ వీసాల ప్రాసెసింగ్‌ను నిరవధికంగా నిలిపివేశారు.
ఈ విధానం అమెరికా ఇమిగ్రేషన్ చట్టాలకు విరుద్ధంగా ఉందని, విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు ఉన్న చట్టబద్ధ అధికారాలను మించిందని న్యాయమూర్తి తీర్పునిచ్చారు. కేవలం ఒక వ్యక్తి జాతీయత ఆధారంగా ఇమిగ్రెంట్ వీసా ప్రాసెసింగ్‌ను నిలిపివేయడం చట్టపరమైన విధానానికి అనుగుణంగా లేదని కోర్టు పేర్కొంది. ఈ తీర్పుతో వీసా నిలిపివేత కారణంగా ప్రభావితమైన దరఖాస్తుదారులకు ఊరట లభించే అవకాశం ఉంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!