
జనరల్

‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే 2.4 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను ఈ చిత్రం సొంతం చేసుకుంది. ప్రేక్షకుల ప్రేమ, ఆదరణతో సినిమా విజయవంతమైన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. తాజాగా అన్ని పాస్‌లను అందుబాటులోకి తీసుకురావడంతో మరింత మంది ప్రేక్షకులు ఈ జర్నీలో భాగమయ్యే అవకాశం ఏర్పడింది.
2.4 మిలియన్+ మార్క్‌ను అందుకోవడంతో చిత్రబృందంలో సంబరాలు నెలకొన్నాయి. ఈ వారాంతాన్ని బ్లాక్‌బస్టర్ వీకెండ్‌గా పేర్కొంటూ మేకర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రేక్షకుల నుంచి స్పందన ఇదే విధంగా కొనసాగితే రానున్న రోజుల్లో ఈ చిత్రం మరిన్ని మైలురాళ్లను అందుకునే అవకాశం కనిపిస్తోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!