

లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి ప్రభాస్ "ది రాజా సాబ్" మొదటి పాటకు బలహీనమైన సాహిత్యం రాశారని ప్రభాస్ అభిమానులు తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. దీనికి ఆయన చేసిన ట్వీట్లోని “మన దగ్గర లేని సరుకు ఏంటి” అన్న లైన్ మరింత ఆగ్రహానికి గురిచేసింది. ట్వీట్ స్పష్టంగా లేకపోవడం కూడా నెటిజన్లను అసహనానికి గురి చేసింది.
నెటిజన్లు ఆయనపై విమర్శలు గుప్పిస్తూ—“వినమ్రత నేర్చుకోండి”, “ఇది తెలుగు పాటా? హిందీ పాటా?”, “పాట హిట్ అయితే క్రెడిట్ మీది, ఫెయిల్ అయితే డైరెక్టర్ విజన్ అంటారా?” అంటూ మండిపడ్డారు. కొందరు ఆయన వేరియేషన్ పై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. సాంగ్‌లో తెలుగు లైన్స్ చాలా తక్కువగా ఉన్నాయని చాలామంది పేర్కొన్నారు.
ఇది రామజోగయ్య శాస్త్రి మొదటి వివాదం కాదు. ఇంతకు ముందు మహేశ్ బాబు అభిమానులను “కుక్కలు” అంటూ పరోక్షంగా పేర్కొన్నట్లుగా ఒక ట్వీట్ వైరల్ కావడంతో ఆయనపై ట్రోలింగ్ జరిగింది. తరువాత ఆయన చేసిన "ఎవరి పనిని వాళ్లు చేసుకుంటే ఫలితం దేవరలా వస్తుంది" అన్న వ్యాఖ్యను మెగా క్యాంప్‌పై పరోక్ష విమర్శగా చాలా మంది భావించారు. ఆ మాటతో వారు అసంతృప్తిగా ఉన్నారని టాక్ ఉన్నప్పటికీ, బయటకు మాత్రం ఎలాంటి స్పందన ఇవ్వలేదు. అప్పటివరకు ఆ వివాదాలు చిన్న మాటల భేధాలుగా భావించినా, ఈసారి మాత్రం విమర్శలు పూర్తిగా ఆయన ప్రొఫెషనల్ వర్క్‌పై కేంద్రికృతమయ్యాయి. ప్రభాస్ సినిమా పై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో, అభిమానులు ఆయన మరింత కష్టపడి, మంచి సాహిత్యం రాయాలని భావిస్తున్నారు.









.avif&w=3840&q=75)






కామెంట్స్ (1)
Strong criticism