

అర్షదీప్ సింగ్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆయనతో కనిపించిన ‘మిస్టరీ గర్ల్’ పంజాబీ నటి మరియు మోడల్ సమ్రీన్ కౌర్ అని నెటిజన్లు గుర్తించారు. ఇటీవల అర్షదీప్ షేర్ చేసిన స్నాప్‌చాట్ స్టోరీల్లో ముఖం కనిపించకుండా ఓ యువతితో చేతులు పట్టుకుని కనిపించడంతో ఈ ప్రచారం మొదలైంది. అనంతరం పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌కు ముందు ఎయిర్‌పోర్ట్‌లో ఇద్దరూ కలిసి కనిపించడంతో ప్రేమ వార్తలకు మరింత బలం చేకూరింది.
సమ్రీన్ కౌర్ 2018 ఫెమినా మిస్ ఇండియా ఫైనలిస్ట్‌గా గుర్తింపు పొందింది. ఆమె 83, నెయిల్ పాలిష్ వంటి బాలీవుడ్ చిత్రాల్లో నటించింది. సోషల్ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్లను కలిగి ఉన్న సమ్రీన్ పలు హిట్ మ్యూజిక్ వీడియోల్లోనూ కనిపించింది. ఇద్దరి వేళ్లపై ఒకే తరహా ‘ఏక్ ఓంకార్’ టాటూలు ఉండటాన్ని అభిమానులు ప్రేమకు సంకేతంగా చెబుతున్నారు. అయితే ఈ సంబంధంపై ఇప్పటివరకు ఇద్దరూ అధికారికంగా స్పందించలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!