

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా, దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కనున్నట్లు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రంలో బాలయ్యను సరికొత్తగా చూపించేందుకు వివేక్ ఆత్రేయ ప్రత్యేక కథను సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. రెండు భాగాలుగా ఈ సినిమాను తెరకెక్కించే ఆలోచన కూడా ఉన్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి.
అయితే భారీ బడ్జెట్ కారణంగా ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయిందనే ప్రచారం జరిగింది. తాజాగా సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, వివేక్ ఆత్రేయ ఇటీవల బాలకృష్ణకు ఓ కథా లైన్ వినిపించగా అది ఆయనకు నచ్చినట్లు తెలుస్తోంది. పూర్తి కథను సిద్ధం చేయాలని బాలయ్య సూచించినట్లు సమాచారం. దీంతో దర్శకుడు ప్రస్తుతం స్క్రిప్ట్ అభివృద్ధి పనులతో పాటు ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా ప్రారంభించినట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!