
జనరల్

‘ఓజీ’ విజయంతో ఏర్పడిన క్రేజ్‌ను మరింత పెంచేలా సీక్వెల్ పనులు వేగంగా జరుగుతున్నాయని టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దర్శకుడు సుజీత్ ఇప్పటికే కథపై కసరత్తు చేస్తున్నారని సమాచారం. మొదటి భాగంలో మిగిలిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంతో పాటు కథను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ పాత్రను ఈసారి మరింత శక్తివంతమైన కొత్త కోణంలో చూపించనున్నారని తెలుస్తోంది.
అంతర్జాతీయ క్రైమ్ నేపథ్యంతో కథను రూపొందించే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని సమాచారం. భారీ యాక్షన్ సన్నివేశాలను హాలీవుడ్ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారట. కొత్త పాత్రలు, ట్విస్టులతో పాటు భావోద్వేగాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నారని చెబుతున్నారు. అధికారిక ప్రకటన రాకముందే సీక్వెల్‌పై భారీ హైప్ నెలకొనడం విశేషం.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!