

కార్తీ తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక మార్కెట్‌ను వేగంగా నిర్మించుకుంటున్నాడు. ఒకప్పుడు రజినీకాంత్, కమల్ హాసన్, సూర్య సినిమాలకే తెలుగు ప్రేక్షకుల్లో భారీ ఆదరణ ఉండేది. అయితే బలమైన కథల ఎంపిక, సహజమైన నటనతో కార్తీ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ఆయన డబ్బింగ్ సినిమాలు తెలుగులో మంచి విజయాలు సాధించడంతో నిర్మాతలు కూడా కార్తీతో నేరుగా తెలుగు సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారని సమాచారం. ‘మ్యాడ్’ ఫేమ్ దర్శకుడు కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై కార్తీ ఓ కొత్త సినిమా చేయనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ చిత్రం పూర్తి స్థాయి తెలుగు కథతో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.
ఇక మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కూడా భారీ యాక్షన్ మూవీపై చర్చలు జరుగుతున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ రెండు ప్రాజెక్టులు కన్ఫర్మ్ అయితే కార్తీ మార్కెట్ మరింత పెరగడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఆవారా, నా పేరు శివ, ఊపిరి, ఖైదీ, ఖాకీ, సర్దార్ వంటి చిత్రాలు కార్తీకి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చాయి. ప్రస్తుతం ‘హిట్ 3’ పనులు కూడా త్వరలో ప్రారంభమవుతాయనే వార్తలతో ఆయన ప్రాజెక్టులపై మరింత ఆసక్తి పెరిగింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!