

స్టార్ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్యా మారన్ పెళ్లి వార్తలు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఈ విషయంపై ఇప్పటివరకు అనిరుధ్ గానీ, కావ్యా మారన్ గానీ అధికారికంగా స్పందించలేదు. తాజాగా అనిరుధ్ కుటుంబ సభ్యుడు చేసిన వ్యాఖ్యలతో ఈ రూమర్లకు మరింత ఊతం లభించింది.
ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, కావ్యా మారన్ వ్యక్తిత్వం, వ్యాపార నైపుణ్యాన్ని ప్రశంసిస్తూ, అనిరుధ్ వ్యక్తిగత జీవితంలో త్వరలో మంచి పరిణామాలు చోటుచేసుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే అనిరుధ్–కావ్యా మారన్ వివాహంపై ఇప్పటికీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ తాజా వ్యాఖ్యలు అభిమానుల్లో ఆసక్తిని పెంచగా, సోషల్ మీడియాలో పలువురు ముందస్తుగానే శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పంచుకుంటున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!