

‘మా ఇంటి బంగారం’ విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో హీరోయిన్ సమంత రెమ్యునరేషన్‌పై సినీ వర్గాల్లో విస్తృత చర్చ సాగుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రం కోసం సమంత రూ.7 కోట్ల ఫిక్స్‌డ్ పారితోషికం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే సినిమా లాభాల్లో వాటా (ప్రాఫిట్ షేర్) తీసుకునేలా కూడా ఒప్పందం చేసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వివరాలపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
మయోసైటిస్ కారణంగా కొంతకాలం సినిమాలకు విరామం ఇచ్చిన సమంత, ఈ చిత్రంతో మళ్లీ బలమైన రీఎంట్రీ ఇచ్చినట్లు ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో ఆమెకు ఉన్న మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు భారీ పారితోషికాలు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకెళ్తుండటంతో సమంత రెమ్యునరేషన్ అంశం మరింత చర్చనీయాంశంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!