

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘కల్కి 2’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘కల్కి 2898 ఏడీ’ విజయంతో ఈ సీక్వెల్‌పై అంచనాలు మరింత పెరిగాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్ మళ్లీ ప్రారంభం కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రీప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయని, ఇప్పటికే దిగ్గజ నటులు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్‌లకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం. కొంత విరామం తర్వాత కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించేందుకు చిత్ర బృందం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
వస్తున్న కథనాల ప్రకారం, ఈ వారంలో ప్రారంభమయ్యే తదుపరి షెడ్యూల్‌లో ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్‌లతో పాటు సాయి పల్లవి కూడా పాల్గొనే అవకాశం ఉంది. సాయి పల్లవి అక్టోబర్ 17 నుంచి షూటింగ్‌లో జాయిన్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో ఆమె దీపికా పదుకోణ్ స్థానంలో నటించనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే షూటింగ్ షెడ్యూల్, నటీనటుల వివరాలపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!