

దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమా వ్యాపార పరంగా సరికొత్త సంచలనం సృష్టిస్తున్నట్లు సమాచారం. విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ హక్కుల విషయంలో భారీ ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల పంపిణీ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ సొంతం చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ డీల్ విలువ రూ.300 కోట్లుగా ప్రచారం జరుగుతోంది.
అయితే ఇందులో రూ.15 కోట్లు తిరిగి చెల్లించే మొత్తంగా ఉండటంతో అసలు ఒప్పంద విలువ రూ.285 కోట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అడ్వాన్స్ చెల్లింపులు కూడా పూర్తయ్యాయని, ఒప్పందం ఖరారైందని వార్తలు వినిపిస్తున్నాయి. నిజంగా ఈ స్థాయిలో వ్యాపారం జరిగితే తెలుగు సినిమా చరిత్రలోనే ఇదొక కీలక మైలురాయిగా నిలవనుంది. రాజమౌళి, మహేష్ బాబు కలయికపై ఉన్న అంచనాలకు ఈ వ్యాపార లెక్కలు మరింత బలాన్నిస్తున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!