

బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ సినిమా సరికొత్త రికార్డుల దిశగా దూసుకెళ్తోంది. విడుదలైన తొలి 12 రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1,415 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఇదే జోరు కొనసాగితే త్వరలోనే రూ.1,500 కోట్ల మార్క్‌ను అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమా తదుపరి లక్ష్యం ఏమిటనే ఆసక్తి ప్రేక్షకుల్లోనూ, సినీ వర్గాల్లోనూ పెరుగుతోంది.
ముఖ్యంగా ‘రామాయణ’ రూ.2,000 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెడుతుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఈ భారీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే హిందీ మార్కెట్‌తో పాటు విదేశాల్లోనూ సినిమాకు ఇదే స్థాయిలో ఆదరణ కొనసాగాల్సి ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో వసూళ్లు ఎంతవరకు నిలకడగా ఉంటాయన్నదానిపైనే సినిమా తుది కలెక్షన్లు ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం నమోదవుతున్న వసూళ్ల నేపథ్యంలో రూ.2,000 కోట్ల రికార్డు సాధ్యమవుతుందా అనే చర్చ మొదలైంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!