

విక్టరీ వెంకటేష్ అభిమానులకు మరో ఆసక్తికరమైన అప్డేట్ వినిపిస్తోంది. చాలా కాలం తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి వెంకటేష్ చేస్తున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47’ (AK47) సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయాలు సాధించడంతో, ఈసారి కూడా హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను 2026 అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రంలో నారా రోహిత్, పూజిత పొన్నాడ, రావు రమేష్, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీతాన్ని ఎస్.ఎస్. థమన్ అందిస్తున్నారు. అయితే రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!