

65 ఏళ్ల వయసులోనూ నందమూరి బాలకృష్ణ వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. అఖండ, భగవంత్ కేసరి, డాకు మహారాజ్, వీరసింహారెడ్డి చిత్రాలతో నాలుగు విజయాలను ఖాతాలో వేసుకున్నారు. అయితే ఇటీవల విడుదలైన అఖండ 2 బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో నిలవకపోవడంతో, బాలయ్య తదుపరి సినిమాపై ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో ఆయన 111వ సినిమాపై ఫిల్మ్ నగర్లో చర్చలు మొదలయ్యాయి.
బాలకృష్ణ మరోసారి దర్శకుడు గోపీచంద్ మలినేనితో కలిసి NBK111 చేయనున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మొదట ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో చారిత్రక యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించాలని భావించారు. నయనతార హీరోయిన్గా నటించనుందని, ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకున్నారు. కానీ కథ, స్కేల్ విషయంలో మేకర్స్ వెనక్కి తగ్గినట్లు టాక్. చారిత్రక నేపథ్యం కంటే బాలయ్య ఇమేజ్‌కు తగిన కథతో వెళ్లాలని నిర్ణయించినట్లు గాసిప్స్ వినిపిస్తున్నాయి.
సోషల్ మీడియా కథనం ప్రకారం, ఈ మార్పులకు ప్రధాన కారణం బడ్జెట్ అని తెలుస్తోంది. ఈ సినిమాకు ₹170–200 కోట్ల బడ్జెట్ ప్లాన్ చేయగా, అఖండ 2 భారీ నష్టాలు, పాన్ ఇండియా స్థాయిలో స్పందన లేకపోవడం, OTT ఆదాయం తగ్గడం వల్ల మేకర్స్ ఆలోచనలో పడ్డారట. ఇదే సమయంలో నయనతార ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆమె ₹8 కోట్ల పారితోషికం డిమాండ్ చేయడంతో, మరో హీరోయిన్ను తీసుకుంటే ₹6–7 కోట్లు సేవ్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట. అయితే ఇవన్నీ నిజమా లేక గాసిప్సేనా అన్నది అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!