

మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్, రచయితగా ఎన్నో విజయవంతమైన సినిమాలకు కథలు అందించిన తర్వాత దర్శకుడిగా కూడా సక్సెస్ సాధించారు. ప్రస్తుతం ఆయన వెంకటేష్‌తో ‘ఆదర్శ కుటుంబం’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీనికి ముందు తన తదుపరి సినిమా అల్లు అర్జున్ లేదా జూనియర్ ఎన్టీఆర్‌తో ఉంటుందని, ఆ సినిమా పేరు ‘గాడ్ ఆఫ్ వార్’ అని వార్తలు విస్తృతంగా ప్రచారం అయ్యాయి.
కానీ తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం, త్రివిక్రమ్ ఈ సినిమాను ఈ ఇద్దరు హీరోలతో కాకుండా మరో స్టార్ హీరోతో చేయాలని ఆలోచిస్తున్నారట. రీసెంట్గా ఆయన తమిళ స్టార్ హీరో సూర్యను కలిసినట్టు టాక్ వినిపిస్తోంది. దీంతో త్రివిక్రమ్–సూర్య కాంబినేషన్లో ఒక పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం మొదలైంది. ఈ పరిణామాల వల్ల అల్లు అర్జున్, ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో త్రివిక్రమ్‌పై నెగెటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు.
అయితే సూర్యకు చెప్పిన కథ ‘గాడ్ ఆఫ్ వార్’ దేనా? లేక పూర్తిగా కొత్త కథతో ముందుకు వెళ్తున్నారా? అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ‘గుంటూరు కారం’ తో నిరాశ ఎదురైన త్రివిక్రమ్, ఇప్పుడు వెంకటేష్ సినిమా ద్వారా బలమైన విజయం సాధించాలనే లక్ష్యంతో ఉన్నారు. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ప్రేక్షకులను అలరించే తన స్టైల్‌తో మరోసారి హిట్ అందిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!