
.webp&w=3840&q=75)
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ మరియు సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా డ్రాగన్ పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం, జోర్డాన్ ఎడారుల్లో కీలక షెడ్యూల్ పూర్తి చేసుకుని హైదరాబాద్‌కు చేరింది. ఎన్టీఆర్‌పై హాలీవుడ్ స్థాయి యాక్షన్ సీన్లు తెరకెక్కినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ ఫైట్ సీక్వెన్స్‌లు సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలుస్తాయని సమాచారం.
ఈ సినిమా కోసం ఎన్టీఆర్ పూర్తిగా కొత్తగా మారిపోయారని అభిమానులు ఇప్పటికే చూశారు. సరికొత్త హెయిర్ స్టైల్, రగ్గడ్ లుక్‌తో పాటు దాదాపు 15 కిలోల బరువు తగ్గి పాత్రకు సిద్ధమయ్యారు. హీరోయిన్గా రుక్మిణీ వసంత్ నటిస్తుండగా, విలన్ పాత్రలో టోవినో థామస్ కనిపించనున్నారన్న ప్రచారం ఉంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, జూన్ 25 న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఇక అసలు సర్ప్రైజ్ ఏమిటంటే, ఈ సినిమాలో అఖిల్ అక్కినేని ఒక కీలక గెస్ట్ రోల్లో కనిపించబోతున్నారన్న బజ్. కథలో తక్కువ నిడివి ఉన్నా, భారీ ఇంపాక్ట్ చూపించే పాత్ర కోసం అఖిల్ అయితే సరిపోతారని ప్రశాంత్ నీల్ భావించారట. అధికారిక ప్రకటన ఇంకా రాలేదు కానీ, ఈ వార్తతో నందమూరి మరియు అక్కినేని అభిమానులు ఫుల్ ఎగ్జైట్లో ఉన్నారు. మే 20 న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా పెద్ద అప్డేట్ వస్తుందన్న అంచనాలు కూడా క్రేజ్‌ను మరింత పెంచుతున్నాయి.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!