
జనరల్

కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పరామర్శించారు. గురువారం ఉదయం జరిగిన ఈ భేటీలో పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న గవర్నర్, వైద్యుల సూచనలు పాటించాలని సూచించారు. త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాసేవలో పాల్గొనాలని ఆకాంక్షించారు.
అనంతరం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత లైబ్రరీని సందర్శించిన జస్టిస్ అబ్దుల్ నజీర్ అక్కడ ఉన్న ప్రముఖ రచయితలు, పండితులు, విశ్లేషకులు, పబ్లిక్ పాలసీ నిపుణులు రచించిన పలు పుస్తకాలను పరిశీలించారు. వాటిపై పవన్ కళ్యాణ్‌తో ఆసక్తికరంగా చర్చించారు. పవన్ కళ్యాణ్ అభ్యర్థన మేరకు ఓ పుస్తకంపై గవర్నర్ ఆటోగ్రాఫ్ కూడా చేశారు. తనను ఆప్యాయంగా పరామర్శించిన గవర్నర్‌కు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!