
జనరల్

నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఆశించిన స్థాయిలో ‘ది ప్యారడైజ్’ విజయం సాధించలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా అక్టోబర్ 22న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ కానుంది. ఇదిలా ఉండగా, నాని తన తదుపరి చిత్రం ‘బ్లడీ రోమియో’పై దృష్టి సారించారు. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లు సమాచారం. ప్రస్తుతం ఢిల్లీలో చిత్రీకరణ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీలో వారం రోజుల పాటు షూటింగ్ జరగనుందని, ఆ తర్వాతి షెడ్యూల్ కోసం చిత్రబృందం హైదరాబాద్‌కు రానుందని ప్రచారం సాగుతోంది. ఈ సినిమాలో కథానాయిక ఎవరనేది చిత్రబృందం ఇంకా ప్రకటించలేదు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను 2027 వేసవిలో విడుదల చేయాలని మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!