

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కలయికలో ఓ భారీ చిత్రం తెరకెక్కనుందనే వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానుందని సమాచారం. పూర్తిస్థాయి మాస్ అంశాలతో పాటు భారీ పోరాట ఘట్టాలను ప్రధాన ఆకర్షణగా నిలపనున్నట్లు తెలుస్తోంది. బాలయ్య అభిమానులను అలరించేలా శక్తివంతమైన పాత్రను రూపొందిస్తూనే, తనదైన సామాజిక సందేశాన్ని కథలో జోడించేందుకు కొరటాల శివ ప్రయత్నిస్తున్నారట. ముఖ్యంగా విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఉంటాయని ప్రచారం జరుగుతోంది.
కొరటాల శివ చిత్రాల్లో కథా నేపథ్యానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. ఆయా ప్రాంతాల జీవన విధానాన్ని, అక్కడి పరిస్థితులను కథలో బలంగా ప్రతిబింబించడం ఆయన శైలి. ఇప్పుడు బాలకృష్ణ కోసం ఎలాంటి నేపథ్యాన్ని ఎంచుకున్నారనేది ఆసక్తికరంగా మారింది. కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలకు కూడా ఈ చిత్రంలో పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. కథను ప్రత్యేకంగా తీర్చిదిద్దేందుకు దర్శకుడు ఎంతో కసరత్తు చేస్తున్నారట. దేవర తర్వాత ఆయన రూపొందిస్తున్న చిత్రం కావడంతో అంచనాలు పెరుగుతున్నాయి. సుధాకర్ చెరుకూరి ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. అయితే కథ, తారాగణం, ఇతర వివరాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!