
బిజినెస్

మైదుకూరులో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ప్రకటించింది. నామినేషన్ పత్రాలను చించివేయడంతో వాటి పరిశీలన ప్రక్రియ కష్టంగా మారిందని ఎస్ఈసీ అనిల్ చంద్ర తెలిపారు. జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా మైదుకూరు ఎన్నికను వాయిదా వేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
మైదుకూరు ఎన్నికకు సంబంధించి త్వరలోనే మళ్లీ నోటిఫికేషన్ జారీ చేస్తామని అనిల్ చంద్ర స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణపై సమీక్షలో భాగంగా ఈరోజు సాయంత్రం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిగేలా అవసరమైన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!