

నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఆందోళనకు దిగారు. వైసీపీ చైర్మన్ అభ్యర్థికి చెందిన కుల ధ్రువీకరణ పత్రాన్ని చించివేశారని ఆరోపిస్తూ తన అనుచరులతో కలిసి నిరసన తెలిపారు. దీంతో డీఎస్పీ రామాంజి నాయక్ అక్కడికి చేరుకుని వైసీపీ నేతలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పోలీసులు సహకరించాలని కోరినా పరిస్థితి సద్దుమణగకపోవడంతో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. ఈ విషయాన్ని శిల్పా చక్రపాణి రెడ్డి జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, సమస్యను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు సమాచారం.
మరోవైపు, నంద్యాల మున్సిపల్ కార్యాలయం వద్ద ఎంపీ బైరెడ్డి శబరి ఆందోళన చేపట్టారు. గొడవలు చేసేందుకు వచ్చిన వైసీపీ నాయకులను బయటకు పంపించాలని డిమాండ్ చేస్తూ కార్యాలయ గేటు వద్ద బైఠాయించారు. ఈ ఘటనలతో రెండు మున్సిపల్ కార్యాలయాల వద్ద ఉద్రిక్తత నెలకొనగా, పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు ప్రయత్నించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!