26, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నకిలీ నంబర్‌ ప్లేట్లపై వరంగల్‌ పోలీసుల ఉక్కుపాదం..

Writer: Chandrika 12:54 PM, 26 అక్టోబర్, 2026
నకిలీ నంబర్‌ ప్లేట్లపై వరంగల్‌ పోలీసుల ఉక్కుపాదం..

వాహనాలకు నంబర్‌ ప్లేట్లు లేకుండా నడపడం, రిజిస్ట్రేషన్‌ నంబర్లను మార్ఫింగ్‌ చేయడం, ఇతరుల నంబర్లను వినియోగించడం, సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలపై వరంగల్‌ పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. గతంలో ఇలాంటి ఉల్లంఘనలకు జరిమానాలు విధించేవారు. అయితే, తాజాగా తనిఖీల్లో నంబర్‌ ప్లేట్లను మార్చినట్లు లేదా తప్పుడు నంబర్లను ఉపయోగించినట్లు గుర్తిస్తే వాహనాలను సీజ్‌ చేయడంతోపాటు చీటింగ్‌ కేసులు నమోదు చేస్తున్నారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో వాహనాల సంఖ్య పెరుగుతుండటంతో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. చలాన్ల నుంచి తప్పించుకునేందుకు కొందరు వాహనదారులు నంబర్‌ ప్లేట్లను మారుస్తున్నట్లు గుర్తించిన పోలీసులు, ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు తనిఖీలు ముమ్మరం చేశారు.

చీటింగ్‌ కేసులు నమోదైతే ముఖ్యంగా యువత, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. విదేశాలకు వెళ్లే సమయంలో, ఉద్యోగాల కోసం జరిగే ధ్రువీకరణ ప్రక్రియలో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. కేసు నమోదైన తర్వాత వాహనాన్ని సీజ్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించవచ్చు. అనంతరం కోర్టులో విచారణ కొనసాగుతుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాహనంపై అధికారిక రిజిస్ట్రేషన్‌ నంబరునే ప్రదర్శించాలని హనుమకొండ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ కె. ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. నెల రోజుల క్రితం వరంగల్‌లో ఓ ద్విచక్ర వాహనం ఇంజిన్‌ నంబరును పరిశీలించగా, నంబర్‌ ప్లేట్‌ మార్చినట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. తాజాగా హనుమకొండలోని అశోక జంక్షన్‌ వద్ద తనిఖీల్లో మరో ద్విచక్ర వాహనం నంబర్‌కు, చలాన్లలో నమోదైన నంబర్‌కు తేడా కనిపించింది. విచారణలో నంబర్‌ ప్లేట్‌ను మార్ఫింగ్‌ చేసినట్లు గుర్తించడంతో చీటింగ్‌ కేసు నమోదు చేసినట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రకాశం జిల్లాలో దారుణం.. ఆరేళ్ల బాలికపై అత్యాచారం

ప్రకాశం జిల్లాలో దారుణం.. ఆరేళ్ల బాలికపై అత్యాచారం

హర్మూజ్‌లో నౌకలపై దాడులు.. ప్రపంచ చమురు సరఫరాపై ఆందోళనలు

హర్మూజ్‌లో నౌకలపై దాడులు.. ప్రపంచ చమురు సరఫరాపై ఆందోళనలు

ఆంథ్రోపిక్ క్లాడ్ ఏఐతో అమెరికా ఎన్నికల డేటా యాక్సెస్‌పై కలకలం

ఆంథ్రోపిక్ క్లాడ్ ఏఐతో అమెరికా ఎన్నికల డేటా యాక్సెస్‌పై కలకలం

మహారాష్ట్ర సీఎంతో రేవంత్‌రెడ్డి కీలక సమావేశం

మహారాష్ట్ర సీఎంతో రేవంత్‌రెడ్డి కీలక సమావేశం

కొలీజియం నిర్ణయాల క్రమంపై మాజీ న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు
ట్యాగ్లు
వరంగల్‌ పోలీసులుహనుమకొండ ట్రాఫిక్‌ పోలీసులునకిలీ నంబర్‌ ప్లేట్లువాహన రిజిస్ట్రేషన్‌ట్రాఫిక్‌ నిబంధనలుచీటింగ్‌ కేసులుట్రాఫిక్‌ చలాన్లువాహనాల సీజ్‌రోడ్డు భద్రతతెలంగాణ వార్తలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

కొలీజియం నిర్ణయాల క్రమంపై మాజీ న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు

బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా ‘అర్నబ్’.. ఏపీ తీరానికి రెడ్‌ అలర్ట్‌!

బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా ‘అర్నబ్’.. ఏపీ తీరానికి రెడ్‌ అలర్ట్‌!

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘ది ఇండియా హౌస్’లో సయీ మంజ్రేకర్ పవర్‌ఫుల్ లుక్ లీక్
గాసిప్స్

‘ది ఇండియా హౌస్’లో సయీ మంజ్రేకర్ పవర్‌ఫుల్ లుక్ లీక్

రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై మాజీ కోచ్ సోహమ్ దేశాయ్ కీలక వ్యాఖ్యలు
క్రీడలు

రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై మాజీ కోచ్ సోహమ్ దేశాయ్ కీలక వ్యాఖ్యలు

వైద్య విద్యారంగంలో ఎన్టీఆర్ సేవలు చిరస్మరణీయం: ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్
జనరల్

వైద్య విద్యారంగంలో ఎన్టీఆర్ సేవలు చిరస్మరణీయం: ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్

వైద్య విద్యారంగంలో ఎన్టీఆర్‌ సేవలు చిరస్మరణీయం.. ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ ప్రశంసలు
జనరల్

వైద్య విద్యారంగంలో ఎన్టీఆర్‌ సేవలు చిరస్మరణీయం.. ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ ప్రశంసలు

రష్మిక ఆత్మవిశ్వాసంపై మధుబాల ప్రశంసలు.
సినిమాలు

రష్మిక ఆత్మవిశ్వాసంపై మధుబాల ప్రశంసలు.

ప్రభాస్ ‘ఫౌజీ’లో నేతాజీ పాత్రపై విమర్శలు
గాసిప్స్

ప్రభాస్ ‘ఫౌజీ’లో నేతాజీ పాత్రపై విమర్శలు

ప్రకాశం జిల్లాలో దారుణం.. ఆరేళ్ల బాలికపై అత్యాచారం
జనరల్

ప్రకాశం జిల్లాలో దారుణం.. ఆరేళ్ల బాలికపై అత్యాచారం

‘సైయారా’ తర్వాత అహాన్ పాండే మరో క్రేజీ ప్రాజెక్ట్
సినిమాలు

‘సైయారా’ తర్వాత అహాన్ పాండే మరో క్రేజీ ప్రాజెక్ట్

జ్వరంతో బాధపడుతూనే హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ అద్భుత శతకం..
క్రీడలు

జ్వరంతో బాధపడుతూనే హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ అద్భుత శతకం..

హర్మూజ్‌లో నౌకలపై దాడులు.. ప్రపంచ చమురు సరఫరాపై ఆందోళనలు
జనరల్

హర్మూజ్‌లో నౌకలపై దాడులు.. ప్రపంచ చమురు సరఫరాపై ఆందోళనలు

నకిలీ నంబర్‌ ప్లేట్లపై వరంగల్‌ పోలీసుల ఉక్కుపాదం..
జనరల్

నకిలీ నంబర్‌ ప్లేట్లపై వరంగల్‌ పోలీసుల ఉక్కుపాదం..

బుక్‌మైషోలో ‘418’ హవా
గాసిప్స్

బుక్‌మైషోలో ‘418’ హవా