

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి భారీ విజయాలతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించారు. ఇంటెన్స్ భావోద్వేగాలు, రా యాక్షన్, బలమైన హీరో క్యారెక్టర్స్ ఆయన సినిమాల ప్రత్యేకతగా నిలిచాయి. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ‘స్పిరిట్’ అనే భారీ పోలీస్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ప్రభాస్ కెరీర్లోనే అత్యంత పవర్ఫుల్ చిత్రంగా ఉండబోతుందనే అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన ఆడియో గ్లింప్స్‌కు అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పటికే స్పిరిట్ సినిమా మార్చ్‌లో రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించారు.
‘స్పిరిట్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్లో మరో మెగా ప్రాజెక్ట్ ‘యానిమల్ పార్క్’పై దృష్టి పెట్టనున్నారు. రణబీర్ కపూర్ నటించిన ‘యానిమల్’ రూ.900 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనంగా మారింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కనున్న ‘యానిమల్ పార్క్’ మరింత డార్క్‌గా ఉంటుందని ఇప్పటికే దర్శకుడు హింట్ ఇచ్చారు. ఈ సినిమాలో రణబీర్ ద్విపాత్రాభినయం చేయనుండగా, రష్మిక మందన్న, త్రిప్తి దిమ్రి పాత్రలు మరింత కీలకంగా ఉండనున్నాయి.
‘యానిమల్’ ఫ్రాంచైజీని మూడు భాగాలుగా రూపొందించాలని సందీప్ రెడ్డి వంగా ప్లాన్ చేస్తున్నారని రణబీర్ వెల్లడించారు. రెండో భాగమైన ‘యానిమల్ పార్క్’ షూటింగ్ వచ్చే ఏడాది లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాతో రూ.1500 నుంచి 2000 కోట్ల వసూళ్లను లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ‘స్పిరిట్’తో ప్రభాస్ ఇమేజ్ను మరో స్థాయికి తీసుకెళ్లి, ‘యానిమల్ పార్క్’తో భారత బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయాలనే గట్టి ప్లాన్‌లో వంగా ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!