

తమిళనాడులో జరిగిన కరూరు ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయినా, నటుడు విజయ్ ప్రజాదరణలో మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఈ ఘటన తర్వాత ప్రజల మనసులో ఏ మార్పు వచ్చిందో తెలుసుకోవడానికి డీఎంకే ప్రభుత్వం ఒక సర్వే నిర్వహించిందట. ఆ సర్వే ఫలితాలు డీఎంకే నాయకత్వాన్ని చాలా సంతోషపరిచాయట.
సర్వే ప్రకారం విజయ్ ప్రజాదరణ ఇంకా అలాగే కొనసాగుతోందట. ఆయన స్థాపించిన టీవీకే పార్టీకి సుమారు 23% ఓటు షేర్ వచ్చే అవకాశం ఉందని చెబుతోంది. ఇక డీఎంకే మరియు దాని మిత్రపక్షాలు మాత్రం ఇంకా 50% ఓట్లతో బలంగా నిలిచే అవకాశం ఉందట.
ఏఐఏడీఎంకే మరియు బీజేపీ పార్టీలు విజయ్‌తో చేతులు కలపాలని చూస్తున్నా, సర్వే ప్రకారం విజయ్ ఏ పార్టీతోనైనా పొత్తు పెడితే ఆయన ఓటు శాతం తగ్గే అవకాశం ఉందట. కానీ ఆయన ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగితే, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎదగవచ్చని చెబుతోంది.
విజయ్ దీర్ఘకాల రాజకీయ లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాడని తెలుస్తోంది. అయితే ఏఐఏడీఎంకే, బీజేపీతో పొత్తు పెడితే ముఖ్యమంత్రిపదవి రేసులో నిలిచే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ విజయ్ పదే పదే బీజేపీతో పొత్తు పెట్టుకోనని స్పష్టంగా చెబుతున్నాడు. ఏఐఏడీఎంకే విషయమై మాత్రం పూర్తిగా తిరస్కరించలేదు.
ఇక డీఎంకే మాత్రం తన బలమైన స్థాయిని కొనసాగిస్తూ, మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని నమ్ముతోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!