

మహావతార్ నరసింహ సినిమా విజయానంతరం నిర్మాత నాగ వంశీ ప్రకటించిన ‘వాయుపుత్ర’ యానిమేషన్ చిత్రం ప్రస్తుతం నిలిపివేయబడినట్లు సమాచారం. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందాల్సిన ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ సిద్ధమై, ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. యానిమాట్రానిక్స్, మోషన్ క్యాప్చర్ వంటి ఆధునిక సాంకేతికతతో భారీ స్థాయిలో రూపొందించాలని భావించగా, కేవలం టెక్నాలజీ ఖర్చులే సుమారు 38 కోట్లు అవుతాయని అంచనా. మొత్తం బడ్జెట్ 50 నుంచి 55 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఓటీటీ వేదికల నుంచి ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాకపోవడం కూడా ఈ నిర్ణయానికి కారణమని సమాచారం. నిర్మాణ సంస్థకు మంచి సంబంధాలు ఉన్నప్పటికీ, డిజిటల్ హక్కులకు 15 నుంచి 20 కోట్ల మధ్య మాత్రమే ఆఫర్ రావడం వల్ల థియేటర్లపై ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సి వస్తుందని భావించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అంత పెద్ద మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టేందుకు ముందుకు రాకపోవడంతో ప్రాజెక్ట్ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.
.webp&w=3840&q=75)





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!