

మంత్రి కొండా సురేఖ వ్యవహారం నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. కొండా సురేఖను రాష్ట్ర క్యాబినెట్ నుంచి తొలగించే అవకాశం ఉందన్న ప్రచారం కొనసాగుతున్న సమయంలోనే.. కొండా కుటుంబంతో బీజేపీ హైకమాండ్ టచ్‌లోకి వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ ఎంపీ ద్వారా కొండా మురళిని బీజేపీ అగ్రనేతలు సంప్రదించినట్లు సమాచారం అందిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కొండా కుటుంబం రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర చర్చ సాగుతోంది.
ఇదే సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా కొండా కుటుంబాన్ని బీజేపీలో చేరాలని ఆహ్వానించినట్లు కూడా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంపై బీజేపీ అధిష్ఠానం, అమిత్ షా, కొండా మురళి లేదా మంత్రి కొండా సురేఖ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఈ పరిణామాలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ఊహాగానాలుగానే ఉన్నాయి. అధికారిక ధ్రువీకరణ వెలువడితేనే ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.





కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!