

టాలీవుడ్ నుంచి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఆసక్తికరమైన చిత్రాల్లో మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ నటించిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ కూడా ఒకటి. శశాంక్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మ్యాజికల్ ఎంటర్టైనర్ ఇటీవల విడుదలైన ట్రైలర్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా నందమూరి నటసింహం బాలకృష్ణ ట్రైలర్‌కు వాయిస్ ఓవర్ అందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను మరింత ప్రత్యేకంగా నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. బాలకృష్ణ తర్వాత ఎన్టీఆర్ కూడా ఈ సినిమా ప్రమోషన్‌లో భాగం కానున్నారనే వార్త నందమూరి అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఎస్.ఎస్. రాజమౌళి సమర్పణలో వస్తున్న ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!