

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో, జూన్ 3న ప్రత్యేక ప్రీమియర్ ప్రదర్శనలు నిర్వహించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. సాధారణంగా విడుదలకు ముందు రోజు ఒకే ప్రీమియర్ ప్రదర్శన ఉండగా, ఈ సినిమాకు మాత్రం రెండు ప్రీమియర్ ప్రదర్శనలు నిర్వహించే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో జూన్ 3న సాయంత్రం 6:55 గంటలకు ఒక ప్రదర్శన, రాత్రి 10:30 గంటలకు మరో ప్రదర్శన నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందుకోసం ప్రత్యేక ప్రభుత్వ ఉత్తర్వులు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆ ఉత్తర్వులు లభిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో చెల్లింపు ప్రీమియర్ ప్రదర్శనలు నిర్వహించే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ ప్రీమియర్ల వ్యూహం పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!